పిల్లల ఐక్యూ వీర లెవల్ లో ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!

తల్లిదండ్రులు కొన్ని పనులు చేయడం ద్వారా పిల్లలలో ఐక్యూ స్థాయిలు మరింత మెరుగవుతాయి.

మెదడును పదును పెట్టే దిశగా పిల్లలను నడపాలంటే ఆటలు చాలా ఉత్తమం. బలాలు, బలహీనతలను ఎలా పరిష్కరించుకోవాలో వీటి వల్ల అర్థమవుతుంది.

పజిల్స్ కొనుగోలు చేసి వాటిని పిల్లలతో పరిష్కరింపజేయవచ్చు. ఇలా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది.

పిల్లల ఐక్యూ మెరుగుపరచడానికి చెస్ చాలా మంచి గేమ్. పిల్లలతో చెస్ ఆడిస్తుంటే  ఆలోచనా  వేగం పెరుగుతుంది.

కథలు అల్లడం, సగం కథను ఇచ్చి దాన్ని విజయవంతంగా ముగించమనడం వంటి పనులు పిల్లల ఆలోచనాశక్తిని చాలా మెరుగుపరుస్తాయి.

గిటార్, సితార్, హార్మోనియం వాయించడం  వంటి సంగీత వాయిద్యాలు  పిల్లల మెదడుకు పదును పెడతాయి.

పిల్లలలో మేధో శక్తి పెరగాలంటే అబాకస్ చక్కని మార్గం. పిల్లలను అబాకస్ తరగతిలో చేర్చాలి.

శ్వాస వ్యాయామాలు పిల్లల మానసిక ఆరోగ్యానికి  గొప్పగా సహాయపడతాయి.  రోజూ కొద్ది సేపు లోతైన శ్వాస ధ్యానాన్ని అలవాటు చెయ్యాలి.