రియల్ టైం రిటైల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐకి భారత్‌లో గొప్ప ఆదరణ ఉంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ఇతర దేశాల్లోనూ ఇది అందుబాటులోకి వచ్చింది

మొబైల్ ఫోన్‌ ద్వారా బ్యాంకు అకౌంట్ల మధ్య నగదు బదిలీకి ఆస్కారం కల్పించే యూపీఐని నిత్యం కోట్ల మంది వినియోగిస్తున్నారు.

ఇటీవలే ఫ్రాన్స్ యూపీఐని అనుమతించింది

యూపీఐని అనుమతించిన తొలి దేశం భూటాన్

2022లో ఓమాన్‌లో యూపీఐ చెల్లింపుల సదుపాయం ప్రారంభమైంది.

మష్రీక్ సంస్థకు చెందిన నియోపే యాప్‌తో 2022లో యూఏఈలో దీన్ని లాంచ్ చేశారు

లిక్విడ్ గ్రూప్-ఎన్‌ఐపీఎల్ ఒప్పందంతో సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ సహా పలు తూర్పు, ఆగ్నేషియా దేశాల్లో యూపీఐ ప్రారంభమైంది. 

2022 నుంచి యూకే కూడా యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి వచ్చాయి

ఎన్‌ఐపీఎల్-వరల్డ్ లైన్ ఒప్పందంతో ఐరోపాలోని పలు దేశాల్లోనూ యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి.

2024లో శ్రీలంక, మారిషస్‌లో కూడా యూపీఐ అందుబాటులోకి వచ్చింది.