సింహం vs పులి:  ఎవరు ఎక్కువ ప్రాణాంతకం!

పులులు సాధారణంగా సింహాల కంటే పెద్దగా, బలంగా ఉంటాయి. పూర్తిగా పెరిగిన మగ పులి.. సింహం కంటే ప్రమాదకరంగా ఉంటుంది. 

పులులలో కండరాలు చాలా బలంగా ఉంటాయి. దూరంగా ఉండే జంతువులను వేటాడడంలో పులులు గొప్ప సామర్థ్యం చూపిస్తాయి. 

పులులు ఒంటరి జంతువులు. ఇవి పూర్తిగా తమ స్వంత బలంపైనే ఆధారపడి వేట సాగిస్తాయి. సింహంతో పోల్చుకుంటే వేట నైపుణ్యాలు ఎక్కువ. 

సింహాలు సమష్టిగా జీవిస్తాయి. ఒక జంతువును వేటాడేటపుడు బృందంగా దాడి చేస్తాయి. పులులతో పోల్చుకుంటే తక్కువ బలమైనవి కావడం వల్ల కలిసి వేటాడతాయి. 

పులితో పోల్చుకుంటే సింహం పంజా పవర్ చాలా ఎక్కువ. దగ్గర ఉండే జంతువును పడగొట్టడంలో సింహం గొప్ప ప్రతిభను చూపుతుంది. 

సింహాలు వేట సమయంలో కూడా అహంకారపూరితంగా ఉంటాయి. పులిలా సమయం కోసి వేచి చూసే అలవాటు సింహానికి ఉండదు