తల్లిదండ్రులను చూసి పిల్లలు తొందరగా నేర్చుకునే అలవాట్లు ఇవే..!

ఇంటిపని, కుటుంబం, ఉద్యోగం పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటే పిల్లలు కూడా పాఠశాలకు వెళ్లడం, ఇంట్లో పనులు చేయడం, క్రమశిక్షణగా ఉండటం నేర్చుకుంటారు.

తల్లిదండ్రులు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే పిల్లలు కూడా దాన్నే అలవాటు చేసుకుంటారు. ఇది వారికి కుటుంబంతో గట్టి బంధాన్ని ఏర్పాటుచేస్తుంది.

తల్లిదండ్రులు పెద్దలను  గౌరవించడం, వారితో సంభాషించే విధానం పిల్లలను ప్రభావితం చేస్తుంది. తల్లిదండ్రులు ఎలా చేస్తారో పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు.

డబ్బు విషయంలో తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్తలు  పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పుతాయి. పొదుపు, మదుపు మీద అవగాహన పెంచుతాయి.

 తల్లిదండ్రులు సమయం ప్రకారం పనులన్నీ చక్కబెడుతుంటే పిల్లలలో సమయ నిర్వాహణ అలవడుతుంది.  ఇది పిల్లల భవిష్యత్తుకు దోహదపడుతుంది.

తల్లిదండ్రులు కొత్త విషయాలను నేర్చుకుంటూ వాటిని పిల్లలతో పంచుకుంటూ ఉంటే పిల్లలు కూడా తమకు తెలియకుండానే జీవితాంతం ఏదో ఒక విషయాన్ని నేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు.

తల్లిదండ్రులు  పిల్లల ముందు జాలి, కరుణ, దయ, సహాయం చేసే గుణాన్ని ప్రదర్శించాలి. కోపం, నిరాశ, నిస్పృహ వంటి పరిస్థితులలో  ఓర్పుగా ఉండాలి.  ఇది పిల్లలలో మెంటల్ బ్యాలెన్స్ ను పెంచుతుంది.

మొక్కల పెంపకం, రీసైక్లింగ్, పరిశుభ్రత, ఆహరం-నీరు వృథా వంటి విషయాలు తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు.