మేక మాంసం
ఉల్లిపాయలు టేబుల్ స్పూన్లు నూనె ,స్పూన్ దాల్చిన చెక్క, లవంగాలు, బిరియాని ఆకు టీస్పూన్ జీలకర్రటేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి స్పూన్ పసుపు పొడి tsp కాశ్మీరీ మిర్చి స్పూన్ కారం పొడి
ముందుగా ఒక పాత్రలో నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క , లవంగం, బిరియాని ఆకు , జీలకర్ర వేసి వేయించాలి.
మాంసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నల్ల మిరియాలు, పసుపు పొడి వేసి కలపండి. మాంసం నుండి నీరు విడుదలయి, ఆవిరైపోయే వరకు మీడియం వేడి మీద ఉడికించాలి.
తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
అనంతరం కారం పొడి, కాశ్మీరీ మిర్చి, కరాహి మసాలా, తాజా టొమాటోలు, టమోటో ప్యూరీ వేసి కలపండి. టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
ఇప్పుడు కావలసిన విధంగా సూప్ లేదా గ్రేవీని బట్టి నీరు పోయండి, అందులో బేబీ పొటాటోలను వేయండి. మాంసం మృదువుగా, బంగాళాదుంపలు ఉడికినంత వరకు ఉడకబెట్టండి.