జపాన్‌కు చెందిన ఎగ్ ఆఫ్ ది సన్  అనే మామిడి పండు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరు పడింది

జపాన్ వాతావరణ పరిస్థితులకు అనుగూణంగా ఈ హైబ్రీడ్‌ను రూపొందించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరు పడ్డ ఈ మామిడి పండు జపాన్‌లో పుట్టింది.

దీన్ని మియాజాకీ మామిడి అని అంటారు అత్యద్భుతమైన రుచి, రంగు కారణంగా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ మామిడి పండుకు ఎగ్ ఆఫ్ ద సన్ అని పేరు. అంటే సూర్యుడిని గుర్తుకు తెచ్చేలా ఎరుపు వర్ణంలో ఉంటుంది.

1950ల్లో ఈ హైబ్రీడ్‌ను ప్రత్యేకమైన విధానంలో అంటుకట్టడంతో రూపొందించారు. జపాన్‌లో మియజాకీ ప్రిఫెక్చర్‌ వాతావరణ పరిస్థితులకు అనుగూణంగా ఉండేలా సిద్ధం చేశారు.

2021లోనే ఈ మామిడి భారత్‌లో అడుగుపెట్టింది. బీహార్‌లోని ధనాకియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ అనే రైతు రెండు మియాజాకీ మామిడి మొక్కలను దిగుమతి చేసుకున్నారు.