ఇడ్లీని లైట్ తీసుకుంటున్నారా.. ఎంత మేలు చేస్తుందో తెలుసా? 

ఇతర టిఫిన్లతో పోల్చుకుంటే ఇడ్లీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇడ్లీ బరువు నియంత్రణకు బాగా సహాయపడుతుంది.

ఇడ్లీని పులియబెట్టిన పిండి, బియ్యం నుంచి తయారు చేస్తారు. ఇది కండరాల మరమ్మత్తుకు బాగా ఉపయోగపడుతుంది.

పులియబెట్టడం ద్వారా జరిగే కిణ్వ ప్రక్రియ కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

ఇడ్లీలో కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. బి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఇడ్లీ సహాయపడుతుంది.

ఇడ్లీలో పీచు పదార్థాలు లేకపోయినప్పటికీ, చెట్నీ లేదా సాంబార్ ద్వారా ఫైబర్ మన శరీరంలోకి చేరుతుంది.

మినగపప్పు, బియ్యం పిండి సమ్మేళనం కిణ్వ ప్రక్రియకు గురి కావడం వల్ల ఇడ్లీ తగినన్ని ప్రోటీన్లతో నిండి ఉంటుంది.

ఇడ్లీ గ్లూటెన్ రహితంగా ఉంటుంది. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులకు ఇడ్లీ సరైన ప్రత్యామ్నాయం.

ఇడ్లీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే ఇడ్లీ తినడం వల్ల తగినన్ని కార్బోహైడ్రేట్లు శరీరంలోకి చేరి శక్తిని అందజేస్తాయి.