ఈ 8 రహస్యాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదట..!

జీవితంలో ప్రతి విషయాన్ని అందరితో చెప్పుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా 8 విషయాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదు.

స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు.. మిమ్మల్ని నమ్మి ఏదైవా రహస్యాలు చెప్పినప్పుడు వాటిని ఇతరులకు షేర్ చేయకూడదు.

చాలామంది బలహీనతలు వారి భావోద్వేగాల రూపంలో బయటకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనిషిలో బలహీనత బయట పడకూడదు. బలహీనత బయట పడకపోవడం గొప్ప బలమవుతుంది.

భవిష్యత్తు గురించి ఏవైనా ప్రణాళికలు వేసుకున్నట్లైతే వాటిని ఇతరులతో పంచుకోకూడదు.

ఇప్పటి సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా ఉన్నాయి. ఎంత సంపాదిస్తున్నారనే విషయాన్ని ఎవరికీ పూర్తీగా స్పష్టంగా చెప్పకూడదు.

కష్టాలు, బాధలు ఎవరికీ చెప్పకూడదు.  చాలామంది వీటిని విని ఎంజాయ్ చేస్తారు.  మరికొందరు ఎగతాళి చేస్తారు.

ఆడవారు  అయినా, మగవారు  అయినా తమ జీవిత భాగస్వామి గురించి చెడుగా ఎవ్వరికీ చెప్పకూడదు.

ఎవరైనా, ఎప్పుడైనా అవమానిస్తే ఆ విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు.

ఒక చేత్తో చేసే దానం మరొక చేతికి తెలియకూడదు అంటారు. ఎవరికైనా సహాయం చేస్తే  అది ఇంకెవరికీ చెప్పకూడదు.