దేశంలో అనేక రకాల బీర్ బ్రాండ్లు ఉన్నా.. మద్యం ప్రియులను ఎక్కువగా ఆకట్టుకునే బీర్లు కొన్నే ఉన్నాయి. అవేంటంటే..

ఆదరణ పొందడంతో పాటూ విస్తృతంగా లభించే బీర్లలో కింగ్ ఫిషర్ టాప్‌లో నిలిచింది. దీన్ని బెంగళూరుకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ తయారు చేస్తోంది.

పురాతన బీర్ బ్రాండ్లలో కల్యాణి బ్లాక్ లేబుల్ ఒకటి. దీన్ని యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ తయారు చేస్తోంది. ఈ బ్రాండ్ తూర్పు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.

ప్రసిద్ధి చెందిన బీర్ బ్రాండ్లలో హైవార్డ్స్ 5000 కూడా ఉంది. దీన్ని 1974లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఉత్తమ బీర్ బ్రాండ్లలో గాడ్ ఫాదర్ ఒకటి. జమ్మూలోని దేవన్స్ మోడరన్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ దీన్ని తయారు చేసింది.

అత్యుఉత్తమ 5 భారతీయ బీర్ బ్రాండ్లో బీరా-91 కూడా ఒకటి. దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో ఈ బీరు ఎంతో ప్రాచుర్యం పొందింది.

ప్రముఖ బీర్ బ్రాండ్లలో నాకౌట్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో నాకౌట్ బీరుకు మంచి డిమాండ్ ఉంది.

పురాతన బీర్ బ్రాండ్లలో రాయల్ ఛాలెంజ్ ఒకటి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ బీరు మాదిరిగానే ఈ బీరుకూ ఎంతో ప్రాముఖ్యత ఉంది.

గోవాలో ఎంతో ప్రాచుర్యం పొందిన బీర్లలో కింగ్స్ బీరు ఒకటి. 2015 వరకూ ఈ బీరు గోవాలోని బీచ్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో దొరుకుతోంది.

భారత్‌లో ప్రసిద్ధి చెందిన బీర్లలో సింబా ఒకటి. చేదుగా ఉండే బీర్లు నచ్చని వారంతా ఎక్కువగా సింబా బీర్లనే తాగుతుంటారు. పలు రాష్ట్రాల్లో ఇది అందుబాటులో ఉంది.

మద్యం ప్రియులను ఎక్కువగా ఆకట్టుకునే బీర్లలో థండర్ బోల్ట్ ఒకటి. ఈ బీరును మౌంట్ శివాలిక్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ 1984లో తీసుకొచ్చింది.