జీవక్రియలను వేగవంతం చేసి ఒంట్లో వేడిని పెంచే థర్మోజెనిక్ ఫుడ్స్‌తో త్వరగా బరువు తగ్గొచ్చు.

ఈ ఫుడ్స్ ఒంట్లో కొవ్వును కరిగించేందుకు సాయపడతాయి. మరి మనకు అందుబాటులో ఉన్న థర్మోజెనిక్ ఫుడ్స్ ఏంటంటే..

గ్రీన్ టీ‌లోని కేటఛిన్స్ కారణంగా జీవ క్రియలు వేగవంతమవుతాయి

అల్లానికి కూడా ఈ లక్షణం ఉంది. ఇది కొవ్వును కరిగించడంతో పాటు ఆకలిని నియంత్రిస్తుంది.

మిరపకాయల్లోని కాప్సియాసిన్ రసాయనం కూడా శరీరంలో ఉష్ణాన్ని పెంచి కొవ్వును త్వరగా కరిగిస్తుంది.

ఒంట్లోని చెక్కరలు కొవ్వుగా మారకుండా దాల్చిన చెక్క అడ్డుకుంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు

కాఫీలోని కెఫీన్ కూడా మెటబాలిజంను పెంచి ఒంట్లోని కొవ్వు త్వరగా కరిగేలా చేస్తుంది.

యాపిల్ సిడర్ వెనిగర్‌తో  ఆకలిపై నియంత్రణ వస్తుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు

ప్రొటీన్లు అధికంగా ఉండే చికెన్, టర్కీ, చేపలు, టోఫూ వంటివి కూడా మెటబాలిజంను పెంచి బరువుతగ్గేలా చేస్తాయి

ధన్యాలు జీర్ణం చేసుకునేందుకు శీరరం ఎక్కువ శక్తిని వినియోగించాలి. కాబట్టి ఇవి కూడా బరువు తగ్గేందుకు సాయపడతాయి

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గించుకునేందుకు ఇవి ఉపయుక్తమైనవి

కొబ్బరి నూనె కూడా మెటబాలిజంను పెంచుతుంది. ఆకలి తగ్గిస్తుంది. ఫలితంగా కొవ్వు త్వరగా కరుగుతుంది.