మీకూ ఈ లక్షణాలుంటే.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే లెక్క!

ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు అవసరం. ఏది లోపించినా శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

పెదవులు నిర్జీవంగా,  ఎర్రగా కందిపోయినట్టు ఉండటం.  నీరసంగా అనిపించడం వంటి లక్షణాలుంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువ ఉన్నాయని అర్థం.

ఆహారం తిన్నప్పుడు, బ్రష్ చేసినప్పుడు చిగుళ్ళ నుండి రక్తం వస్తుంటే విటమిన్-సి లోపం ఉందని అర్థం.

గోళ్ళ మీద చిన్నగా తెల్లని మచ్చలు ఉంటే అది జింక్ లోపమని అర్థం.

వేళ్లు, కీళ్ల మధ్య తీవ్రమైన శబ్దం ఎక్కువగా వస్తుంటే అది కాల్షియం లోపం అని గుర్తించాలి.  తగినంత కాల్షియం లేకపోవడం వల్ల ఆర్ధరైటిస్ సమస్య కూడా వస్తుంది.

రాత్రి సమయంలో చూపు విషయంలో ఇబ్బందులు తలెత్తుతుంటే  విటమిన్-ఎ లోపం ఉందని అర్థం.  ఇది కాలేయ సమస్యలకు కూడా కారణమవుతుంది.

గోర్లు, జుట్టు బలహీనంగా ఉంటే శరీరంలో బయోటిన్  లోపముందని  అర్థం.

కాలి మడమలు చీలి ఇబ్బంది పెడుతుంటే విటమిన్-బి2 లోపం ఉందని అర్థం.