నెలరోజుల పాటూ మాంసాహారం తినడం మానేస్తే.. ఏం జరుగుతుందంటే..!

నెలరోజులు మాంసాహారం మానేసి కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటే శరీరంలో ఊహించని మార్పులుంటాయి.

నాన్ వెజ్ మానేస్తే యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి.

నెలరోజులు శాకాహారం మాత్రమే తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

మాంసాహారంలో ఉపయోగించే మసాలా, ఉప్పు, కారం తగ్గడం వల్ల అధికరక్తపోటు సమస్య నియంత్రణలోకి వస్తుంది.

శాకాహారంలోనే సమతులాహారం తీసుకోవడం వల్ల ఎముక బలం పెరుగుతుంది.

మాంసాహారం మానేస్తే శరీరం శుద్ది అవుతుంది. రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.

మాంసాహారం మానేస్తే ఆర్థరైటిస్, వాపులు, నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి.

నెలరోజులలోనే బరువు పరంగా శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి.