మంచివి అనుకుంటున్న ఈ అలవాట్లు.. నిజానికి మీకు కీడు చేస్తాయి..!
నీళ్లు ఎక్కువగా తాగితే మంచిది అంటారు. కానీ, మరీ అతిగా నీళ్లు తాగితే హైపోనాట్రేమియాకు దారి తీస్తుంది.
ఆరోగ్యానికి పళ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ, చాలా ఫలాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి.
గ్రీన్ టీ పుష్కలంగా యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అలాగే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం, నిద్రకు ఆటంకం కలగడం, ఆందోళన మొదలైనవి గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్.
కొందరు తరచుగా విటమిన్, ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతుంటారు. వాటి వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి.
సలాడ్‌లను పదే పదే తీసుకోవడం కూడా మంచి అలవాటు కాదు.
కాఫీ, టీలు తాగితే మంచిదని కొందరు, తాగకపోతే మంచిదని కొందరు అనుకుంటారు. అమితంగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిదని చాలా మంది అంటుంటారు. ఇవి ఎముకల పుష్టికి సహాయపడతాయి.
భోజనానికి ప్రత్యామ్నాయంగా ఫ్రూట్ జ్యూస్‌లు, స్మూతీలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు అంటుంటారు. కానీ, వీటి వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ అందకుండా పోతుంటుంది.