ఈ డ్రింక్స్‌ తాగితే అలసట దూరం..

దోసకాయ జ్యూస్ తాగితే అలసట, ఒత్తిడిని తగ్గించడంతో పాటు మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది.

 ద్రాక్ష రసం రోజు తీసుకుంటే అలసటను దూరం చేసుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

అలసట, నీరసం వంటి సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.

నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అలసటను దూరం చేస్తాయి.

చియా సీడ్స్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రాత్రంతా నీటిలో నానబెట్టిన చియా గింజలను తీసుకుంటే అలసటను తగ్గిస్తాయి.