డబ్బు చెట్టుగా పిలుచుకునే మనీ ప్లాంట్ విషయంలో చాలామంది పొరపాట్లు చేస్తారు.

జ్యోతిష్యం ప్రకారం ఇళ్లలో కొన్ని మొక్కలు పెంచితే చాలామంచిది. వాటిలో మనీ ప్లాంట్ ఒకటి.

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ కుబేరుడు,  బుధ గ్రహంతో అనుసంధానమై ఉంటుంది.

మనీ ప్లాంట్ ఇంట్లో సరైన దిశలో ఉంచితే ఆర్థిక స్థితిని మెరుగుపరిచి సుఖ శాంతులను చేకూరుస్తుంది.

ఇళ్లలో మనీ ప్లాంట్ ను ఎక్కడంటే అక్కడ ఉంచితే మంచి ఫలితాలకు బదులు సమస్యలు పెరుగుతాయి.

ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ ఉంచితే ఆర్థిక నష్టాలు, వృత్తిపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలు కలిగే  ప్రమాదం ఉంటుంది.

పడమర దిక్కులో లేదా తూర్పు దిక్కులో మనీ ప్లాంట్ ఉంచితే అరిష్టం. మానసిక ఒత్తిడులు పెరుగుతాయి.

మనీ ప్లాంట్ ను ఆగ్నేయ దిశలో ఉంచితే చాలా మంచిది. శుక్రవారం పాలు పోసి పూజ చేస్తే మరింత మంచిది.

ఆగ్నేయ  దిశ వినాయకుడితో ముడి పడి ఉంటుంది. ఈ కారణంగా ఇంటికి సంతోషం, ఐశ్వర్యం చేకూరతాయి.