పుట్టగొడుగులు తింటే కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..

పుట్టగొడుగులలో విటమిన్-బి, డి విటమిన్లు. ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి పోషకాలు అందిస్తాయి.

చలికాలంలో విటమిన్-డి లోపానికి చెక్ పెడతాయి. విటమిన్-డి ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

పుట్టగొడుగులలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు  ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

తక్కువ కేలరీలు ఉండటం వల్ల పుట్టగొడుగులు తీసుకుంటే అధిక బరువు, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి.

పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ సమ్మేళనాలు శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతాయి.

కొన్ని రకాల పుట్టగొడుగులు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి చాలా మంచివి.

పుట్టగొడుగులలో ఉండే ఫైబర్ ప్రేగులను, జీర్ణాశయ గోడల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచుతుంది.

 విటమిన్-డి ఉండటం మూలాన  రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడటంలో సహాయపడతాయి.