శరీరంలో కొన్ని భాగాల్లో వాపు ఉంటే.. అది లివర్ సమస్యగా భావించాల్సి ఉంటుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

కాలేయంలో అదనంగా కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫ్యాటీ లివర్ అనే వ్యాధి సోకుతుంది. 

పాదలు, చీలమండలో వాపు ఉంటే కాలేయ వ్యాధికి సంకేతం కావొచ్చు. ఇలా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

పాదలు, చీలమండలో వాపు ఉంటే కాలేయ వ్యాధికి సంకేతం కావొచ్చు. ఇలా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

కడుపులో నీరు చేరి వాపు రావడం కూడా కాలేయ వ్యాధికి కిందకు రావొచ్చు. దీన్ని సిర్రోసిస్ అని కూడా అంటారు. 

ఫ్యాటీ లివర్ వ్యాధికి గురైన వారిలో అరికాళ్లు, ముఖం, చేతుల్లో వాపు వస్తుంది. 

ఛాతీ ప్రాంతంలో వాపు రావడం, బిగుతుగా అనిపిస్తుంటే కాలేయ వ్యాధికి సంకేతమని గుర్తించాలి. 

కళ్లు ఉబ్బడం, తెల్లగుడ్డు మొత్తం పసుపు రంగులో కనిపించినా కాలేయం సరిగ్గా పని చేయలేదని అర్థం. 

పొత్తి కడుపులో ఉబ్బరంగా ఉన్నా కాలేయ వ్యాధికి సంకేతంగా భావించాలి. 

ఇది అవగాహన కోసమే.. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.