పిల్లలు ఎత్తు పెరగట్లేదా? వెంటనే ఈ పనులు మొదలెట్టండి!

చాలామంది పిల్లలు వయసు పెరిగినా పొట్టిగా ఉంటారు. పిల్లలు వయసుకు తగిన ఎత్తు ఉండాలంటే ఈ పనులు చెయ్యాలి.

పిల్లల ఎత్తు పెరగాలంటే వారికి ఇచ్చే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండాలి.

 జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ అంటే పిల్లలకు మహా ఇష్టం. ఇవి పిల్లల ఎత్తును మందగించేలా చేస్తాయి. వెంటనే వీటిని మాన్పించాలి.

జింక్ సమృద్దిగా తీసుకుంటే పిల్లలు బాగా పెరుగుతారు. 

వేరుశనగ, జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలలో జింక్ సమృద్దిగా ఉంటుంది. అన్ని గింజలు కలిపి రోజూ ఓ గుప్పెడు తీసుకునేలా చేయాలి.

విటమిన్-డి, కాల్షియం లోపించినా పిల్లలు ఎత్తు పెరగరు. ఇవి పిల్లలకు అందేలా చూడాలి.

శరీరాన్ని సాగదీసే వ్యాయామాలు, యోగాసనాలు ప్రాక్టీస్ చేయించాలి. ఇవి ఎముకలు బాగా ఎదగడానికి సహాయపడతాయి.

ఆటలలో పిల్లలను ప్రోత్సహించాలి. అవుడ్ డోర్ ఆటలు ఆడటం వల్ల పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు.