డయాబెటిస్‌ ఉన్నవారు పుచ్చకాయ తినడం మంచిదేనా..?

పుచ్చకాయ తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయా లేదా అనేది తినే పండు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

ఇది సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే, పుచ్చకాయ తినడం వల్ల చక్కెర స్థాయిపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించదు.

పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.

డయాబెటిస్‌ ఉన్నవారు పుచ్చకాయను తినవచ్చు. కానీ, మితంగా తినాలని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయను భోజనంతో పాటుగా తినండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది.

పుచ్చకాయ రసం తాగడానికి బదులుగా ముక్కలుగా తిన్నండి. రసం తాగడం వల్ల చక్కెర శరీరంలోకి త్వరగా వెళుతుంది.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.