మీకు బీపీ పెరిగిందా.. వీటికి దూరంగా ఉండాల్సిందే!

బీపీ.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తాయి. దాన్ని కంట్రోల్ చేయాలంటే.. సరైన డైట్‌తో పాటు హెల్దీ లైఫ్‌స్టైల్‌ని పాటించాలి.

బీపీ ఉన్నవారు రెగ్యులర్‌గా పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా.. కూరగాయలు, పండ్లు వంటివి తరచూ తింటూ ఉండాలి.

తరచూ వర్కౌట్ చేయాలి. ఇలా చేస్తే.. బాడీ ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంటుంది. ఫలితంగా.. బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.

ప్రతిరోజూ తగినంత నీరు తాగాల్సిందే. కనీసం 8 గ్లాసులైనా నీరు తాగితే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. బీపీ కంట్రోల్ అవుతుంది.

ఉప్పుకి మాత్రం దూరంగా ఉండాలి. ఆహారంలో తక్కువగా ఉప్పుని కలుపుకోవాలి. లేదంటే.. బీపీ పెరిగి ఇతర సమస్యలొస్తాయి.

స్మోకింగ్ అలవాటు ఉంటే.. దాన్ని వెంటనే మానేయాలి. ఎక్కువగా ధూమపానం చేస్తే, బీపీ మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నా బీపీ వస్తుంది. ఇతర సమస్యలూ వస్తాయి. కాబట్టి.. మద్యపానానికి దూరంగా ఉంటే మంచింది.

శరీర బరువును మెయింటెయిన్ చేయాలి. దీంతో బాడీ యాక్టివ్‌గా ఉండి.. బీపి, గుండె జబ్బుల వంటి ఆరోగ్య సమస్యలు రావు.