బాదం పాలు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

బాదం పాలు వల్ల అనేక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి తీసుకోవడం వల్ల శరీరానికి బలానిస్తోందని అంటున్నారు.

వీటిలో కాల్షియం మెండుగా ఉంటుంది. బాదంలో విటమిన్ డి సైతం సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎముకులు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

బాదం పాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కండరాల పనితీరు, రక్తంలో చక్కెర నియంత్రణ, హైపర్‌ టెన్షన్‌ కంట్రోల్‌ చేయడం, ఎముక, ప్రొటీన్‌, డీఎన్‌ఏ  ఏర్పడటానికి దోహదపడుతోంది. 

బరువు తగ్గాలనుకునే వారు బాదం పాలు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. 

బాదం పాలు.. బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను అంతగా పెంచవు. ఈ పాలలో కార్బోహైడ్రేట్లు ఉండవు, ఇది రక్తంలో చక్కెర, ఎనర్జీ స్పైక్‌లకు తగ్గిస్తుంది. 

బాదంలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ కూడా తక్కువగా ఉంటుంది. షుగర్‌ పేషెంట్స్‌, పీసీఓఎస్‌తో బాధపడే వారు సైతం బాదం పాలు తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు.

బాదం పాలలో విటమిన్‌ ఈ మెండుగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇది శరీర కణాలు ఫ్రీ రాడికల్స్‌ కారణంగా దెబ్బతినకుండా రక్షిస్తాయి. రోగనిరోధక శక్తినీ మెరుగుపరుస్తుంది.