పూర్వకాలం నుంచీ సుగంధ ద్రవ్యాలలో ఏలకులకు ఓ ప్రత్యేకత స్థానం ఉంది. రోజూ వీటిని తీసుకోవడం వల్ల కలిగే  ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఏలకులలో ఉండే విటమిన్ B6, విటమిన్ B3, విటమిన్ C తదితరాలు నోటి దుర్వాసనను పోగొట్టి తాజాగా ఉండేలా చేస్తాయి.

ఆహారంలో ఏలకులను చేర్చడం వల్ల.. జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

తరచూ ఏలకులు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, కడుపు నొప్పి తదితర సమస్యల నుంచి బయటపడొచ్చు.

ఏలకులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రధానంగా మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

ఏలకులు నమలడం వల్ల వాంతులు, వికారం తదితర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 

పురుషులు తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఏలకులు ఎంతో ఉపయోగపడతాయి.

ఏలకులు శరీరంలో పేరుకుపోయిన కాల్షియం, యూరియా, టాక్సిన్‌లను తొలగించి మూత్రశాయాన్ని డిటాక్స్ చేస్తాయి.

ఏలకులను పరిమితిలో తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.