చాలా మంది స్నానం చేసిన తర్వాత.. వెంటనే నీరు తాగుతుంటారు. అయితే ఇలా చేయడం కరెక్టా.. కాకా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా స్నానం చేసిన వెంటనే దాహం వేస్తుంది. లోపలి, బయట ఉష్ణోగ్రతలో తేడా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది.

స్నానం చేసిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.

స్నానం చేసినప్పుడు శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. వెంటనే నీరు తాగడం వల్ల రక్తప్రసరణపై ఒత్తిడి పెరుగుతుంది.

స్నానం చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత కూడా వెంటనే నీరు తాగకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియలో ఆటకం ఏర్పడుతుంది.

ఆహారం తిన్న 30 నుంచి 45 నిముషాల తర్వాత నీరు తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బయటి నుంచి ఇంట్లోకి వచ్చిన వెంటనే నీరు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం.

ఇలా చేస్తే శరీరంలోని ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు కలుగుతుంది. ఇది కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.