ఆప్రికాట్లను సీమబాదం అని కూడా అంటారు. రోజూ ఎండిన ఆప్రికాట్లను తీసుకోవడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండిన ఆప్రికాట్లలో ఉండే విటమిన్-ఏ, విటమిన్-ఇ.. కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఆప్రికాట్లో పుష్కలంగా ఉండే పొటాషియం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

ఎండిన ఆప్రికాట్లలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంతో పాటూ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఆప్రికాట్లలోని కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఎండిన ఆప్రికాట్లలో ఉండే ఐరన్.. రక్తహీనతను నివారించడంలో సాయపడుతుంది.

ఎండిన ఆప్రికాట్లను తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.