కార్బోహైడ్రేట్లు, గ్లూటెన్ ఉంటుందన్న కారణంగా అనేక మంది గోధుమలను వద్దనుకుంటున్నారు.

ఇలాంటి వారికి పలు అధ్భుతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రొటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు

మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే బార్లీతో షుగర్ ఈజీగా కంట్రోలవుతుంది

ఉపవాసాల్లో ఎక్కువగా తినే బక్ వీట్ కూడా సాధారణ గోధుమలకు మంచి ప్రత్యామ్నాయం

కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే రాజ్‌గిరా గింజలు చలికాలానికి అనుకూలమైన ఆహారం. గోధుమకు మంచి ప్రత్యామ్నాయం

గ్లుటెన్ లేని క్వినోవా కూడా గోధుమలకు బదులుగా తినొచ్చు. వీటిల్లో ఫైబర్, ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి

గోధుమలకు మంచి ప్రత్యామ్నాయమైన మొక్కజొన్నలు కూడా చలికాలంలో తినదగినవి

గుండె ఆరోగ్యానికి మేలు చేసే జొన్నలు కూడా గోధుమలకు బదులు తినదగిన పోషకాహారం