తుది దశకు ముఖేష్ అంబానీ వయాకాం 18లో వాల్ట్ డిస్నీ విలీన ఒప్పందం

ముఖేష్ అంబానీ వయాకాం 18లో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల విలీన ప్రక్రియ తుది ద‌శ‌కు చేరుకుంది

850 కోట్ల డాలర్ల విలువైన రెండు సంస్థల విలీన ఒప్పందాన్ని ఆమోదించాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ సీసీఐని కోరింది

వయాకాం 18, స్టార్ ఇండియా విలీన ప్రక్రియ పూర్తైన తర్వాత జాయింట్ వెంచర్ ఏర్పాటవుతుందని సీసీఐకి వెల్లడి

అమెరికా వాల్ట్ డిస్నీ కంపెనీ స్టార్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో టీవీ బ్రాడ్ కాస్టింగ్, ఓటీటీ ప్లాట్ ఫామ్ నిర్వహిస్తోంది

రిలయన్స్ అనుబంధ వయాకాం 18 భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా టీవీ చానెళ్ల బ్రాడ్ కాస్టింగ్ బిజినెస్‌ను కల్గి ఉంది 

రూ.70 వేల కోట్లకు గత ఫిబ్రవరిలో వాల్ట్ డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి

రెండు సంస్థల విలీనం తర్వాత భారత్ మీడియా రంగంలో ఇది అతిపెద్ద సంస్థగా అవతరిస్తుంది

పలు భాషల్లో 100కి పైగా చానెల్స్, 750 మిలియన్ల మంది వీక్షకులు గల రెండు లీడింగ్ ఓటీటీలు ఒక్కటవుతాయి

జాయింట్ వెంచర్ సంస్థకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చైర్ పర్సన్‌గా ఉంటారు 

విలీనం తర్వాత రిలయన్స్‌కు 63.16 శాతం, వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటాలు కలిగి ఉంటాయి