భారతదేశంలో మైక్రోసాఫ్ట్‌  రూ.25,700 కోట్ల పెట్టుబడులు

కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సామర్థ్యాల విస్తరణ కోసం 

యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి దాదాపు రూ.25,700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు

బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు

తాము చేపట్టిన ‘ఎడ్వాంటైజ్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా 

వచ్చే ఐదేళ్లలో కోటి మంది భారతీయులకు ఏఐ నైపుణ్యాల కోసం శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు

ఏఐ ఆవిష్కరణల విషయంలో భారత్‌ వేగంగా లీడర్‌గా ఎదుగుతోందని ఆయన కొనియాడారు

ఈ పెట్టుబడులు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలకు, 

సంస్థలకు ఉపయోగపడతాయని సత్య నాదెళ్ల ఆశాభావం వ్యక్తం చేశారు

దేశంలో నానాటికీ పెరుగుతున్న ఏఐ స్టార్ట్‎అప్ లు, పరిశోధకుల అవసరాలను 

తీర్చడం కోసం ‘ఏఐ కంప్యూటింగ్‌ ఎకోసిస్టమ్‌’ను మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి చేయనుంది