అందమైన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం.. సుస్వాగతం..

వైవిధ్యానికి పెట్టింది పేరు... అందమైన చిత్తూరు!

చిత్తూరు జిల్లాను తలుచుకోగానే కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులు... పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగ రూపంలో పరమశివుడు పూజలందుకుంటున్న శైవక్షేత్రం శ్రీకాళహస్తి.. సత్యప్రమాణాలకు సాక్షిగా వరసిద్ధి వినాయకుడు ధర్మపరిపాలన చేస్తున్న కాణిపాకం క్షేత్రాలు తలపునకు వస్తాయి. అత్యంత పవిత్రమైన, ప్రాచీనమైన, ఈ పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న కారణంగా చిత్తురు జిల్లా అంటే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అందరిలోనూ ముద్రపడిపోయింది. ఈ జిల్లా ఆధ్యాత్మిక స్థలాలకు మాత్రమే గాక మరెన్నో రమణీయ పర్యాటక ప్రదేశాలకు, ప్రకృతి సౌందర్యానికి కూడా నెలవై ఉంది.

ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతితో ముడిపడిన విజ్ఞానదాయకమైన, వినోదభరితమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, చారిత్రక కేంద్రాలను చిత్తూరు జిల్లాలో తిలకించవచ్చు. చంద్రగిరి కోట, తలకోన - నెలకోన జలపాతాలు, మదనపల్లె సమీపంలో హార్స్‌లీ హిల్స్‌, కైలాసకోన వాటర్‌ ఫాల్స్‌, గెల్లతీగ, పులిగుండు తదితర అటవీ పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లాకు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇలా ఇంకెన్నో విశేషాలు తెలుసుకోవడానికి చిత్తూరు జిల్లాను ఒకసారి చుట్టివద్దామా ! మరిన్ని విశేషాలు

పశ్చిమ గోదావరి

తూర్పు గోదావరి

నవ్యాంధ్ర అమరధామం

కృష్ణా

విజయనగరం

విశాఖపట్టణం జిల్లా