Abn logo
Jul 25 2021 @ 22:36PM

అభివృద్ధి కమిటీల్లో శాశ్వత సభ్యులుగా జడ్పీటీసీలు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

- మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడి

-  జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి హాజరు

- గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన సభ


నాగర్‌కర్నూల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు జడ్పీటీసీ లను శాశ్వత సభ్యులుగా పరిగణించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని తి రుమల ఫంక్షన్‌ హాల్‌లో జడ్పీ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్‌ పద్మావతి అధ్యక్షతన గంట న్నర ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తమ విధులు, అధికారా లపై జడ్పీటీసీలు ఆందోళన నిర్వహించా రు. మండల అభివృద్ధి సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదని ఇతర ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తమను భాగస్వాములను చేయడం లేదని వారు ప్రస్తావించారు. సమావేశం ప్రారంభా నికి ముందే తమ వినతి పత్రాన్ని తీసు కుని స్పష్టమైన హామీ ఇవ్వాలని మంత్రి నిరంజన్‌రెడ్డిని, ఇతర అధికారులను వారు కోరారు. దీంతో మంత్రి  జడ్పీటీసీల వద్దకు వెళ్లి వారి విజ్ఞాపన పత్రాన్ని తీసుకున్న తర్వాత సభను ముందుకు కొనసాగించారు. గత సమావేశంలో చేసిన తీర్మానాలపై తీసుకున్న చర్యల తర్వాత సమావేశాన్ని ముందుకు కొన సాగించాలని వంగూరు, కల్వకుర్తి జడ్పీటీసీలు కేవీఎన్‌.రెడ్డి, పోతుగంటి భరత్‌ ప్రసాద్‌లు సూచించగా జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజీ సింగ్‌ ఎంజీఎల్‌ఐ, డిండి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యను తెరమీదకు తీసుకొచ్చారు. మంత్రి  జోక్యం చేసుకుని మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో జడ్పీ టీసీలను విధిగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అభివృద్ధి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్‌ ఎల్‌పీ.శ ర్మన్‌ను ఆదేశించారు. అన్ని జిల్లాల మాదిరిగానే నాగర్‌కర్నూల్‌లో కూడా మన ఇసుక వాహనం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు వేదికలు, వైకుంఠధామాల పెండింగ్‌ బిల్లుల వివరాలను వెంటనే ఇవ్వా లని పంచాయతీరాజ్‌, వ్యవసాయ అధికారులను ఆ దేశించారు. పల్లె ప్రకృతి వనాల సంఖ్యను పెంచేం దుకు కృషి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధు లను కోరిన ఆయన కొత్త గ్రామపంచాయతీల భవన నిర్మాణాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మెటీరియల్‌ కాంపో నెంట్‌ కింద గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాల ను చేపట్టేందుకు తీర్మానించాలని సూచించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి మాట్లాడుతూ సభలో చ ర్చించిన ప్రతి అంశంపై చర్యలు తీసుకుని సభ్యు లకు సమాచారమివ్వాలని ఆదేశించారు. జిల్లాలో వి ద్యుత్‌ శాఖ అధికారుల పనితీరుపై నిరసన వ్యక్త మైంది. ఈ సందర్భంగా ప్రసంగించిన పార్లమెంట్‌ సభ్యుడు రాములు ముఖ్యమంత్రి ప్రకటించిన దళితబంధు పథకంపై సంతోషం వ్యక్తం చేస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు తీర్మానాన్ని బలపర్చి దీన్ని ఆమోదిస్తున్నట్లు జడ్పీచైర్‌పర్సన్‌ ప్రకటించారు. కాగా జిల్లాలో ఆగస్టు 1 నుంచి మన ఇసుక మన వాహనం ద్వారా గృహ నిర్మాణాలకు ఇసుకనందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని ఏడీ మైనింగ్స్‌ను ఆదేశించారు. కొవిడ్‌ మూడవ వేవ్‌ వచ్చినా తట్టుకునేలా వైద్యఆరోగ్య శాఖను సన్నద్ధం చేశామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జడ్పీ సమావేశంలో శాసన మండలి విప్‌ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, శాసన సభ్యులు మర్రి జనా ర్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, జడ్పీ సీఈవో ఉషాలు పాల్గొన్నారు.