Abn logo
Sep 23 2021 @ 00:29AM

మాకు న్యాయం చేయండి

అడిషనల్‌ ఎస్పీకి ఘటన వివరాలను తెలియజేస్తున్న మాజీ జడ్పీటీసీ శారద, వేణు

జిల్లా అడిషనల్‌ ఎస్పీకి మాజీ జడ్పీటీసీ వినతి


పెదనందిపాడు, సెప్టెంబరు 22: మండలంలోని కొప్పర్రులో బుధవారం శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు జిల్లా అడిషనల్‌ ఎస్పీ రిషాంత్‌రెడ్డి వచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ బత్తిని శారద, వేణు దంపతులు మాట్లాడుతూ ముందస్తుగా ప్రణాళిక ప్రకారమే తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని అన్నారు. ట్రాక్టర్లలో రాళ్లు, సిలిండర్లు, పెట్రోలుతో వచ్చి దాడికి పాలప్పడ్డారని, చుట్టుపక్కల వారు సహాయం వలనే ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. దాడి సమయంలో అక్కడ లేని మహిళలపై కూడా స్థానిక పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.