Abn logo
Sep 20 2021 @ 02:22AM

ప్రలోభాల ‘ఫలితం’

కాకినాడలో ఏర్పాటు చేసిన ఓ కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న కౌంటింగ్‌ సిబ్బంది

  • జడ్పీ ఎన్నికల్లో ముందే ఊహించిన ఫలితాలు
  • పరిషత బరి నుంచి టీడీపీ తప్పుకోవడంతో లెక్కింపుపై సర్వత్రా అనాసక్తి
  • ఎన్నికల్లో అధికారపార్టీ అక్రమాలకు నిరసనగా ముందే పోలింగ్‌ బహిష్కరణ
  • దీంతో పోటీలో పెద్దగా ఎవరూలేక వైసీపీ అభ్యర్థులు ఎక్కడికక్కడ  విజయం
  • 61 జడ్పీ స్థానాల్లో 28 చోట్ల అధికార పార్టీ అభ్యర్థులు గెలుపు
  • 999 ఎంపీటీసీ స్థానాలకు 698 చోట్ల  వైసీపీ నేతలు విజయం
  • ఎన్నికలు బహిష్కరించినా 93 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల విజయం
  • సొంతంగాను, ఇటు టీడీపీ సహకారంతో జనసేనకు 80 చోట్ల గెలుపు
  • 19 ఎంపీపీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల అనూహ్య విజయం
  • పరిషత ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంతో వైసీపీకి కలిసివచ్చిన అవకాశం
  • నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు బరితెగింపు
  • ఈనెల 24న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, 25న జడ్పీ చైర్మన ఎన్నిక

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జడ్పీ ఫలితాల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరిలో పెద్దగా ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేయకపోవడంతో అధికార పార్టీ తరఫున నిలిచిన వారంతా దాదాపుగా గెలుపొందారు. దీంతో జడ్పీ పీఠం వైసీపీ దక్కించుకుంది. పార్టీ స్థాపించిన ఇన్నాళ్లకు తొలిసారిగా జిల్లా పరిషత చైౖర్మన స్థానం ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఎన్నికలను ప్రతిపక్ష టీడీపీ ముందే బహిష్క రించింది. అధికారం అండతో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని, దీనికి ఎస్‌ఈసీ సహకరిస్తోం దంటూ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయలేదు. దీంతో జడ్పీ, ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ నుంచి మినహా ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు పెద్దగా నిలబడలేదు. ఫలితంగా పోటీచేసిన స్థానాల్లో ఎక్కువగా వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఒకరకంగా ఈ దఫా జడ్పీ ఎన్నికలు చప్పగా సాగాయి. ఎన్నిక ల్లో నామినేషన ప్రక్రియ నుంచి పోలింగ్‌ వరకు ఎక్కడికక్కడ వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడింది. అధికారం అడ్డంపెట్టుకుని పోలీసుల సాయంతో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయ కుండా అడ్డుకుంది. నామినేషన పత్రాలు చించేయడం, అభ్యర్థులను కిడ్నాప్‌ చేయడం, బలవం తపు ఏకగ్రీవాలు చేయించుకుంది. దీంతో టీడీపీ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఫలితంగా పోలింగ్‌ రోజు యథేచ్ఛగా నగదు, మద్యం, చీరల పంపిణీతో ఫలితాలను అధికార పార్టీ తనకు అనుకూ లంగా మల్చుకుంది. దీంతో ఫలితాల్లో 61 జడ్పీటీసీ స్థానాలకు 29, 999ఎంపీటీసీలకు 698 చోట్ల ఆపార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే బరిలో లేకున్నా టీడీపీ తరఫున ముందే నామినేషన్లు వేసిన జడ్పీటీసీల్లో వీఆర్‌పురం మండలంలో టీడీపీ గెలిచింది. అటు 93 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోగా, అటు జనసేన సొంతంగా, టీడీపీ సహకారంతో 80 ఎంపీటీసీలు దక్కించుకుంది. 

అనుకున్నట్లుగానే...

జిల్లా పరిషత ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార వైసీపీ విజయకేతనం ఎగుర వేసింది. తొలిసారిగా జడ్పీ చైౖర్మన కుర్చీ సాధించుకుంది. అయితే ఈ ఫలితాలు ప్రజాభిప్రా యాన్ని ప్రతిబింబించలేదని, పూర్తిగా అధికారం అడ్డంపెట్టుకుని వైసీపీ ఓటర్లను దారికితెచ్చు కుందని ప్రతిపక్ష టీడీపీ పెదవివిరించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతో పోటీలేక వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే పోటీలేని ఈ విజయంతో ఆపార్టీ విజేతల్లోను పెద్దగా ఆనందోత్సాహాలు కనిపించలేదు. ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు జరిగిన ఓట్ల లెక్కింపునకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి 61 జడ్పీ స్థానాలకు వైసీపీ 28 గెలుచుకుంది. ఏజెన్సీలో వీఆర్‌ పురం జడ్పీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. అనేకచోట్ల వైసీపీ అభ్యర్థులకు టీడీపీ ముచ్చెమటలు పోయించింది. మరోపక్క జిల్లాలో మొత్తం 1,086 ఎంపీటీసీ స్థానాలకుగాను 82 చోట్ల వైసీపీ ఏకగ్రీవం చేయించుకుంది. మరో అయిదు చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నికలు జరగలేదు. దీంతో మిగిలిన 999 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ అభ్యర్థులు 698 చోట్ల గెలి చారు. పోటీలో లేకున్నా టీడీపీ 93 ఎంపీటీసీ స్థానాలు, వీఆర్‌పురం జెడ్పీ స్థానం గెలుచుకుంది. ముఖ్యంగా ఏజెన్సీ,అమలాపురం, కాకినాడ డివిజన్లలో టీడీపీ పట్టు నిరూపించుకుంది. పేరుకు వైసీపీ అభ్యర్థులు గెలిచినా టీటీపీ నుంచి తీవ్రపోటీ ఎదుర్కొన్నారు. అనేక మండలాల్లో మొత్తం ఎంపీటీసీ స్థానాల్లో సగానికిపైగా స్థానాల్లో టీడీపీ తీవ్ర పోటీ ఇచ్చింది. ఒకానొకదశలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారనుకున్న సమయంలో వైసీపీ అభ్యర్థులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో గట్టెక్కారు. అటు జనసేన సొంతంగా పోటీచేసిన స్థానాలు, టీడీపీ సహకారంతో జిల్లావ్యాప్తంగా 80 ఎంపీటీసీలు దక్కించుకుంది. అనేక జడ్పీ,ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ నుంచి గెలిచిన అభ్యర్థులు చాలా తక్కువ మెజార్టీతో గట్టెక్కారు. మరోపక్క అనుహ్యంగా జిల్లాలో 19 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించి అధికార వైసీపీకి షాక్‌ ఇచ్చారు. ఈస్థానాల్లో వైసీపీ చాలాచోట్ల మూడోస్థానానికి పడిపోయింది. అలాగే సీపీఎం 7 చోట్ల, బీఎస్పీ, కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కో ఎంపీటీసీ సీటు గెలుచుకున్నాయి. కాగా ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయినా మధ్యాహ్నాం ఒంటిగంట తర్వాత అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఆదివారం అర్ధరాత్రి దాటక పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడయ్యాయి. మరోపక్క జడ్పీ ఎన్నికల్లో పోలయిన మొత్తం ఓట్లలో వైసీపీకి ధీటుగానే టీడీపీ ఓట్లు దక్కించుకుంది. కాగా కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలకు ఈనెల 24న, జిల్లాపరిషత చైౖర్మన ఎన్నిక 25న జరగనుంది. అయితే జడ్పీ చైౖర్మన ఎవరనేది ఇంకా అధికారికంగా వైసీపీ అధిష్ఠానం ప్రకటించలేదు. అయితే కోనసీమ, రామచంద్రపురం, కాకినాడ డివిజన్ల నుంచి ముగ్గురు కుర్చీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఎన్ని సిత్రాలో...

ఒక్క పోస్టల్‌ ఓటుతో గొల్లప్రోలు మండలం కొడవలి వైసీపీ ఎంపీటీసీగా భగవాన గెలు పొందారు. ఈయనకు 877 ఓట్లు పోలవగా, స్వతంత్ర అభ్యర్థి సతీష్‌కు 877 ఓట్లు వచ్చాయి. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఒకటి రావడంతో భగవాన విజయం సాధించారు. పెద్దాపు రం మండలం గోరింట ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థి పచ్చిపాల సతీష్‌  210 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కరప మండలం సిరిపురం ఎంపీటీసీ స్థానాన్ని 5 ఓట్ల మెజార్టీతో జనసేన గెలుచుకుంది. దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసి రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రత్తిపాడు మండలం ఏలూరు ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి 39 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు రీకౌంటింగ్‌ చేపట్టారు. రీకౌంటింగ్‌లో వైసీపీ ఆధిక్యం నాలుగు ఓట్లకు పడిపోయింది. తుని మండలం రేఖవానిపాలెం ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి సూరిబాబు 35 ఓట్లతో విజయం సాధించారు. అయితే పోలింగ్‌ తర్వాత చని పోవ డంతో ఇదే సాకుగా వైసీపీ రీకౌంటింగ్‌కు పట్టుబట్టింది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభా ష్‌చంద్రబోస్‌ సొంత నియోజకవర్గం రామచంద్రపురంలోని ఆయన స్వగ్రామం హసన బాద్‌ ఎంపీసీటీసీగా స్వతంత్ర అభ్యర్థి యన్నందేవీ 114 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధిం చడం విశేషం. ఈమెకు సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ మద్దతుతో విజయం సాధించారు. అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్వగ్రామమైన వెంకటాయపాలెంలో జనసేన అభ్యర్థి కణితి వెంకటేశ్వరి గెలుపొందారు. దీంతో అక్కడ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.