Abn logo
Sep 25 2021 @ 00:00AM

క్రిస్టినాకే కిరీటం

జడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేస్తున్న క్రిస్టినా

జడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక

కోలాహలంగా ప్రమాణ స్వీకారం

భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు 


గుంటూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా కొల్లిపర జడ్పీటీసీ హెన్రీ క్రిస్టినా ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. జడ్పీ కార్యాలయంలో శని వారం కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎన్నికల కమిషన్‌ పరిశీల కుడు లక్ష్మీనరసింహం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికను నిర్వహించారు. వైస్‌చైర్మన్లుగా ఎస్‌.నర్సిరెడ్డి, బత్తుల అనురాధ, కోఆప్షన్‌ సభ్యులుగా షష్మి, గుండాల స్వెనోమ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, కో ఆప్షన్‌ సభ్యులతో జడ్పీ సీఈవో చైతన్య ప్రమాణ స్వీకా రం చేయించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ క్రిస్టినా విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్‌ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు రహదారులు, తాగునీరు, మండల, జిల్లా పరిషత్‌ విద్యా సంస్థలను మెరుగుపరుస్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు, ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామిక వేత్త లు, వ్యాపారులను స్వగ్రామాల అభివృద్ధిలో భాగస్వా ములను చేస్తానన్నారు. కార్యాలయంలో అందు బాటులో ఉంటూ అవినీతి, అక్రమాలకు తావులేకుండా మంచి పాలన అందిస్తానని స్పష్టం చేశారు.  జిల్లా పరి షత్‌ కార్యాలయం వైసీపీ నేతలు, కార్యకర్తలతో కోలా హలం గా మారింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా పరిశీ లకు డు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, హోంమంత్రి మేక తోటి సుచరిత, డిప్యూటి స్పీకర్‌ కోన రఘుపతి, నరస రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ లు జంగా కృష్ణమూర్తి, కేఎస్‌ లక్ష్మణరావు, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నంబూరి శంకర రావు, డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి, అన్నాబత్తుని శివకుమార్‌, కిలారి వెంకటరోశయ్య, డాక్టర్‌ మేరుగ నాగార్జున, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహే ష్‌రెడ్డి, అంబటి రాంబాబు, విడదల రజని, గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, మిర్చియార్డు చైర్మన్‌ చంద్రగిరి యేసురత్నం, డీసీసీబీ చైర్మన్‌ లాల్‌ పురం రాము తదితరులు పాల్గొన్నారు.