ఉద్యోగులు ఐకమత్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2021-10-28T05:41:29+05:30 IST

ఉద్యోగులు, అధి ఉద్యోగులు, అధికారులు ఐకమత్యంగా పని చేయాలని జడ్పీ చైర్‌పర్సన కత్తెర హెనీక్రిస్టీనా తెలిపారు.

ఉద్యోగులు ఐకమత్యంగా పనిచేయాలి
సూపరింటెండెంట్లతో సమీక్షిస్తున్న చైర్‌పర్సన క్రిస్టీనా

గుంటూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, అధి ఉద్యోగులు, అధికారులు ఐకమత్యంగా పని చేయాలని జడ్పీ చైర్‌పర్సన కత్తెర హెనీక్రిస్టీనా తెలిపారు. జడ్పీలో బుధవారం కార్యాలయ సూపరింటెండెంట్లతో, వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులతో ఆమె సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులు సక్రమంగా, సకాలంలో అందేవిధంగా అధికారులు చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అసంపూర్తిగా ఉన్న ఇంజనీరింగ్‌ పనులపై నివేదికలివ్వాలని ఆదేశించారు. ఆయా సమీక్షల్లో సీఈవో చైతన్య, ఏపీ పీఆర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, పూర్ణచంద్రారెడ్డి, నాయకుడు కూచిపూడి మోహన, కత్తెర సురేష్‌ కుమార్‌, పీఆర్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 


సర్పంచల సంఘం సత్కారం  


జడ్పీ చైర్‌పర్సన క్రిస్టీనాకు సర్పంచల సంఘం ఆధ్వర్యంలో ఏపీ పంచాయతీ పరిషత రాష్ట్ర చైర్మన డాక్టర్‌ జాస్తివీరాంజనేయులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలలో సర్పంచలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచలు చిలకా ఆనందరావు(చావపాడు), కృష్ణమోహన (తోకలవారిపాలెం), అఖిలభారత పంచాయతీ పరిషత జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు మన్నెం కిషోర్‌, వేమూరి వెంకటరెడ్డి, చిలకా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:41:29+05:30 IST