Abn logo
Sep 28 2021 @ 22:48PM

జడ్పీ చైర్‌పర్సన్‌కు ఆనం శుభాకాంక్షలు

జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణమ్మ దంపతులకు పుష్పగుచ్ఛం అందచేస్తున్న ఆనం ప్రసాద్‌రెడ్డి

సంగం, సెప్టెంబరు 28: జడ్పీ చైర్‌జ పర్సన్‌ ఆనం అరుణమ్మ, విజయకుమార్‌రెడ్డి దంపతులను మండలంలోని వెంగారెడ్డిపాళెం సర్పంచు ఆనం ప్రసాద్‌రెడ్డి మంగళవారం నెల్లూరులోని వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందచేసి అభినందనలు తెలిపారు. తాను సర్పంచుగా ఉన్న వెంగారెడ్డిపాళెం గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

చేజర్ల : జడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, ఆమె భర్త ఆనం విజయకుమార్‌రెడ్డిలను మంగళవారం నెల్లూరులోని వారి స్వగృహంలో మండల వైసీపీ నాయకులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాంలో మండల వైసీపీ కన్వీనర్‌ తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, మోదేపల్లి పెంచలనాయుడు, అన్నలూరు శ్రీనివాసులనాయుడు, నోటి సుందరరామిరెడ్డి, పోలిరెడ్డి, వెంకటరత్నం, రత్నారెడ్డి, హజరత్తయ్య, రఫి, చేజర్ల, పాడేరు సర్పంచులు ఆవుల వెంకటేశ్వర్లు, గుమ్మా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.