రూ.రెండున్నర కోట్లతో జూ అభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-06T05:37:16+05:30 IST

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో రూ.రెండున్నర కోట్ల ప్రపంచ బ్యాంక్‌ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందినీ సలారియా పేర్కొన్నారు.

రూ.రెండున్నర కోట్లతో జూ అభివృద్ధి

క్యూరేటర్‌ డాక్టర్‌ నందినీ సలారియా

ఆరిలోవ, డిసెంబరు 5: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో రూ.రెండున్నర కోట్ల ప్రపంచ బ్యాంక్‌ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందినీ సలారియా పేర్కొన్నారు. శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జూలోని ఏనుగుల మోటు, రోడ్లు, కోతుల మోట్లు, తదితర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ పనులను వచ్చే మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని చెప్పారు. 


కరోనా వల్ల రూ.రెండున్నర కోట్ల నష్టం

కరోనా కారణంగా సుమారు ఏడు నెలల పాటు మూసివేయడంతో రెండున్నర కోట్ల రూపాయల ఆదాయాన్ని జంతు ప్రదర్శనశాల కోల్పోయిందని నందినీ సలారియా తెలిపారు. సాధారణంగా ఏడాదికి సుమారు రూ.నాలుగున్నర కోట్ల ఆదాయం జూకు వచ్చేదని పేర్కొన్నారు. ప్రస్తుతం జూలో యానిమల్‌ కీపర్స్‌ ఆరుగురు మాత్రమే ఉన్నారన్నారు.

Updated Date - 2020-12-06T05:37:16+05:30 IST