జొమేటో రికార్డ్... వారంలోపే లిస్టింగ్

ABN , First Publish Date - 2021-07-23T21:37:51+05:30 IST

ఐపీఓ లిస్టింగ్ విషయంలో కూడా జొమేటొ రికార్డ్ సృష్టించింది. జులై 14-16 అంటే గట్టిగా మూడురోజుల్లోపే ఇష్యూ క్లోజ్ ముగియగా, దానికి రూ. 2 లక్షల కోట్లు అప్లికేషన్ బిడ్స్ రూపంలో అందాయి.

జొమేటో రికార్డ్... వారంలోపే లిస్టింగ్

హైదరాబాద్ : ఐపీఓ లిస్టింగ్ విషయంలో కూడా జొమేటొ రికార్డ్ సృష్టించింది. జులై 14-16 అంటే గట్టిగా మూడురోజుల్లోపే ఇష్యూ క్లోజ్ ముగియగా, దానికి రూ. 2 లక్షల కోట్లు అప్లికేషన్ బిడ్స్ రూపంలో అందాయి. కంపెనీ ఐపీఓకు వస్తూ సమీకరిస్తామని చెప్పిన మొత్తం కలిపి రూ. 9 వేలకోట్ల లోపే కాగా... ఇంత పెద్దఎత్తున డబ్బొచ్చిపడిందంటే ఐపీఓలంటే, అందులోనూ ఈ ఫుడ్ ఆగ్రిగేటర్ స్టార్టప్ అంటే ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది దానికి తోడు ఐపీఓ ముందుగా జులై 26, 27 తేదీల్లో లిస్ట్ అవుతుందని చెప్పారు.


కానీ జులై 23 నే అంటే ఈరోజే(శుక్రవారం)లిస్ట్ అయ్యింది. కాగా... జులై 16 న ఇష్యూ ముగియగా, జులై 23 న(ఈరోజు), అంటే వారం రోజుల లోపే లిస్ట్ కావడం ఈ మధ్యకాలంలో ఇదే ప్రధమం. ప్రస్తుతం ఈ షేర్లు ఇష్యూ ధర అయిన రూ. 76 తో పోల్చితే  63.16శాతం లాభపడి రూ. 124.25 వద్ద ట్రేడయ్యాయి. 

Updated Date - 2021-07-23T21:37:51+05:30 IST