Abn logo
Aug 2 2021 @ 20:54PM

జొమాటో... త్వరలో మరో ‘మెంబర్‌షిప్ డ్రైవ్’

హైదరాబాద్ : ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో... కొత్తగా మరో మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జొమాటో ప్రో సభ్యత్వంలో భాగంగా రూ. 200 లతో సభ్యత్వం తీసుకుంటే ఫుడ్‌ డెలివరీలపై 30 %  వరకు అదనపు తగ్గింపు, రెస్టారెంట్‌ డైనింగ్‌లో 40 %  వరకు తగ్గింపుతో పాటు వేగవంతమైన డెలివరీలను ఇప్పటికే అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మెంబర్‌షిప్‌ గడువు 90 రోజులుగా ఉంటుంది. కాగా... తాజాగా జొమాటో మరో సరికొత్త మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జోమాటో ప్రో ప్లస్‌ పేరిట కొత్త మెంబర్‌షిప్‌ను ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా అపరిమిత ఫ్రీ డెలివరీలను యూజర్లకు జోమాటో అందించనుంది.