జింబాబ్వే గ్రాండ్‌ విక్టరీ

ABN , First Publish Date - 2021-03-04T09:37:49+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీ్‌సలో జింబాబ్వే ఘనమైన బోణీ చేసింది. కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ (105) సెంచరీతో పాటు బౌలింగ్‌లో డొనాల్డ్‌ తిరిపానో (3/23), విక్టర్‌ న్యూచి (3/30) రాణించడంతో జింబాబ్వే 10 వికెట్లతో...

జింబాబ్వే గ్రాండ్‌ విక్టరీ

  • తొలి టెస్టులో అఫ్ఘాన్‌ చిత్తు


అబుదాబి: అఫ్ఘానిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీ్‌సలో జింబాబ్వే ఘనమైన బోణీ చేసింది. కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ (105) సెంచరీతో పాటు బౌలింగ్‌లో డొనాల్డ్‌ తిరిపానో (3/23), విక్టర్‌ న్యూచి (3/30) రాణించడంతో జింబాబ్వే 10 వికెట్లతో గెలుపొంది.. 1-0తో సిరీ్‌సలో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 133/5తో రెండో రోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే.. విలియమ్స్‌ శతక ప్రదర్శనతో 250 వద్ద ఆలౌటైంది. జింబాబ్వేకు 119 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం డొనాల్డ్‌, న్యూచి దెబ్బకు.. అఫ్ఘాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. తర్వాత 17 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే 3.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 17 రన్స్‌ చేసి అలవోకగా నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్ఘాన్‌ 131 రన్స్‌ చేసింది. 

Updated Date - 2021-03-04T09:37:49+05:30 IST