అలర్జీ పరీక్షలపై 50 శాతానికి పైగా రాయితీ

ABN , First Publish Date - 2021-10-19T08:06:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని రకాలైన అలర్జీలకు సంబంధించి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జెరత్‌ పాత్‌ ల్యాబ్స్‌ అండ్‌ అలర్జీ టెస్టింగ్‌ సెంటర్‌ వెల్లడించింది. కంపెనీ అనుబంధ సంస్థ అయిన అంజన్‌ పాత్‌ ల్యాబ్స్‌ల్లో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు అలర్జీలను గుర్తించే పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

అలర్జీ పరీక్షలపై 50 శాతానికి పైగా రాయితీ

జెరత్‌ పాత్‌ ల్యాబ్స్‌ వెల్లడి 

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని రకాలైన అలర్జీలకు సంబంధించి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జెరత్‌ పాత్‌ ల్యాబ్స్‌ అండ్‌ అలర్జీ టెస్టింగ్‌ సెంటర్‌ వెల్లడించింది. కంపెనీ అనుబంధ సంస్థ అయిన అంజన్‌ పాత్‌ ల్యాబ్స్‌ల్లో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు అలర్జీలను గుర్తించే పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 80 నుంచి 130 వరకు అలర్జీలను గుర్తించే ఈ రక్త పరీక్షలను 50 శాతానికి పైగా డిస్కౌంట్‌తో ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు విటమిన్‌ డీ, బీ12కు సంబంధించిన పరీక్షలు కూడా ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయని జెరత్‌ పాత్‌ ల్యాబ్స్‌ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో సాధారణ అలర్జీలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడతాయని, ఒక్క రక్త పరీక్ష ద్వారా వీటిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే సరిపోతుందని జెరత్‌ పాత్‌ లాబ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ జెరత్‌ అన్నారు. చర్మం ఎర్రబారటం, చర్మంపై దద్దుర్లు, దురద, ఎర్రని కురుపులు, కడుపు నొప్పి, అలర్జిక్‌ రినైటిస్‌ (స్నీజిం గ్‌), సోరియాసిస్‌ సహా మరికొన్ని అలర్జీ లక్షణాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆహారం, ఇన్‌హేలెంట్‌ సహా ఇతరత్రా వాటి ద్వారా అలర్జీలు వస్తాయని వీటన్నింటిని గుర్తించేందుకు ఒక్క రక్త పరీక్ష సరిపోతుందని జెరత్‌ ల్యాబ్స్‌ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో అంజన్‌ పాత్‌ ల్యాబ్స్‌ కేంద్రాలున్నాయని, ఇవి శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లుగా ఉంటాయని తెలిపింది.

Updated Date - 2021-10-19T08:06:52+05:30 IST