Abn logo
Jun 23 2021 @ 23:28PM

గుట్టుచప్పుడు కాకుండా సీరో సర్వే

కామారెడ్డి టౌన్‌, జూన్‌ 23: జిల్లాలో సీరో సర్వేను గుట్టుచప్పుడు కాకు ండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఐసీఎంఆర్‌ బృందం పర్యటించిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో మంగళవారం కామారెడ్డి పట్టణంతో పాటు బీబీపేట, ఎర్రాపహాడ్‌, జుక్కల్‌, మాచారెడ్డి, బుధవారం ఎల్లారెడ్డి, బిచ్కుంద ప్రాంతాల్లో ఐసీఎంఆర్‌ సీరో సర్వే నిర్వహించింది. వివరాలు చెప్పకుండా ఎక్కడ తమ పనితీరు బయటకు వస్తుందోనని జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది సర్వేను తూతూ మంత్రంగా నిర్వహించేలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిర్లక్ష్యం వైఖరి మొదటి నుంచి ఉందని సొంత శాఖలోని సిబ్బందే తెలుపుతున్నారు. వాస్తవానికి ఐసీఎంఆర్‌ బృందం పర్యటనను ప్రజలకు తెలిసేవిధంగా ముందస్తుగా ప్రచార మాద్యమాలకు సమాచారం అందించడానికి ప్రత్యేకంగా వైద్యఆరోగ్యశాఖలో డెమో విభాగం ఉన్న సదరు సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుస్తోంది. అసలే కరోనా కాలం ప్రజలకు వైద్యఆరోగ్యశాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రచార మాద్యమాల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాల్సి ఉన్నా అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అయితే డెమో విభాగంలో పని చేసేందుకు వస్తున్న సిబ్బందిని ఓ ఉద్యోగి లేనిపోనివి ఉన్నతాధికారులకు చెబుతూ వారిని ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేయడంతో పా టు కనీస సమాచారం ప్రచార మాధ్యమాలకు అందకుండా చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై సమాచారం అడిగిన తమకేమీ తెలియదని దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ తమ పనితీరు బయటపడకుండా ఉన్నతాధికారులపై తోసివేసి తప్పించుకుంటున్నారు. వాస్తవానికి వైద్యఆరోగ్యశాఖ ద్వారా జిల్లాలో చేపడుతున్న పలు కార్యక్రమాలను కూలంకుశం గా వివరిస్తూ ఆయా సందర్భాల్లో వైద్యఆరోగ్యశాఖలోని పలు విభాగాల అధికారులు చేపట్టిన సమాచారం, ప్రజలకు చేరాల్సిన ఆరోగ్య సూచన లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ ప్రాంతంలో చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రచార మాద్యమాలకు అందజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ విభాగంను పర్యవేక్షించే సిబ్బంది ఏ మాత్రం తమ విధులను సక్రమంగా చేయడం లేదని తెలుస్తోంది. ఇటీవల డెమో విభాగానికి వచ్చిన ఓ అధికారిణి నానా ఇబ్బందులకు గురి చేయడంతో ఆయన డిప్యూటేషన్‌పై ఇక్కడి నుంచి మరో ప్రాం తానికి వెళ్లినట్లు సమాచారం. డెమో పేరుతో ఓ ఉద్యోగి విధులు నిర్వహి స్తూ కనీస సమాచారం ప్రచార మాద్యమాలకు అందకుండా అలసత్వం వహిస్తు తమకేమి తెలియదని దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ వైద్యఆరోగ్యశాఖలో డెమో విభాగం సిబ్బంది చేస్తున్న నిర్లక్ష్యంపై దృష్టి సారిస్తేనే ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలిసే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మల్లాయిపల్లిలో ఐసీఎంఆర్‌ బృందం పర్యటన
ఎల్లారెడ్డి: మండలంలోని మల్లాయిపల్లిలో బుధవారం ఐసీఎంఆర్‌ బృందం పర్యటించింది.  ఈ సందర్భంగా ఐసీఎంఆర్‌ బృంద సభ్యుడు అన్వర్‌పాషా మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గినందున ప్రజ ల్లో ఇమ్యూనిటీ ఏ విధంగా మెరుగుపడుతుందని, వ్యాక్సినేషన్‌ వల్ల ఏ విధమైన మార్పులు వచ్చాయని  తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 47మంది నుంచి శాంపిళ్లను సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యుడు సత్యనారాయణ, అనిత, మత్తమాల పీహెచ్‌సీ వైద్యుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
బండరెంజల్‌లో ..
బిచ్కుంద: మండలంలోని బండరెంజల్‌ గ్రామంలో బుధవారం ఐసీ ఎంఆర్‌ కేంద్ర బృందం రక్తసేకరణ చేట్టారు. ఽథర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచు కుని ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్‌ ఎలా ఉందనే దానిపై ఈ సర్వే నిర్వహించినట్లు బృంద సభ్యులు తెలిపారు. మొత్తం 56 మంది రక్త నమూనాలు సేకరించినట్లు ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త అనంతన్‌ తెలిపారు.