విశాఖ జిల్లాలో 72,577 స్వయం సహాయక సంఘాలకు రూ.66.42 కోట్ల లబ్ధి

ABN , First Publish Date - 2021-04-24T04:55:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యున్నతి లక్ష్యంగా అమలు చేస్తున్న సున్నా వడ్డీకే రుణాల పథకం ద్వారా జిల్లాలో 72,577 స్వయం సహాయక సంఘాలు లబ్ధిపొందుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

విశాఖ జిల్లాలో 72,577 స్వయం సహాయక సంఘాలకు రూ.66.42 కోట్ల లబ్ధి
మహిళా సంఘాలకు చెక్కు అందిస్తున్న మంత్రి, అధికారులు, నాయకులు

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యున్నతి లక్ష్యంగా అమలు చేస్తున్న సున్నా వడ్డీకే రుణాల పథకం ద్వారా జిల్లాలో 72,577 స్వయం సహాయక సంఘాలు లబ్ధిపొందుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వీరి ఖాతాల్లో ప్రభుత్వం 66.42 కోట్ల రూపాయలు జమ చేసిందని తెలిపారు.


తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా లబ్ధిదారులకు మంత్రి చెక్కు అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, పార్టీ కన్వీనర్లు కె.కె.రాజు, మళ్ల విజయప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T04:55:26+05:30 IST