త్వరలో బ్యాటరీతో నడవనున్న రైళ్లు.. చరిత్ర సృష్టించే నూతన ప్లాన్ సిద్ధం

ABN , First Publish Date - 2022-02-14T16:06:00+05:30 IST

భారతీయ రైల్వే తన నెట్‌వర్క్‌ను నిరంతరం విస్తరిస్తోంది.

త్వరలో బ్యాటరీతో నడవనున్న రైళ్లు.. చరిత్ర సృష్టించే నూతన ప్లాన్ సిద్ధం

భారతీయ రైల్వే తన నెట్‌వర్క్‌ను నిరంతరం విస్తరిస్తోంది. అలాగే పర్యావరణంపై రైల్వేశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇటీవల రైల్వే ఒక ప్రణాళికను సిద్ధం చేసింది దీనితో భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను జీరో కార్బన్ ఎమిషన్ నెట్‌వర్క్‌గా మార్చాలని యోచిస్తోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ పలు చర్యలు చేపట్టగా ఇప్పుడు బ్యాటరీతో నడిచే ఇంజన్లను కూడా రైల్వేశాఖ సిద్ధం చేసింది. దీంతో త్వరలో బ్యాటరీతో రైలును నడపనున్నారు. రైల్వేశాఖ ప్రత్యేక ప్రణాళికతో ఈ బ్యాటరీ ఇంజిన్లను సిద్ధం చేసి.. పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనుంది. ఈ ప్రణాళికకు సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రైల్వేలు 2030 నాటికి 'నెట్ జీరో' కార్బన్ ఎమిషన్ మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్‌గా మారాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి, దీనికి అనుగుణంగా రైల్వే వివిధ చర్యలు చేపడుతోంది. కర్బన ఉద్గారాల స్థాయి దాదాపు సున్నాగా ఉండే వ్యవస్థను సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పాటు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేందుకు, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇది పర్యావరణానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పుడు చాలా నగరాలు కూడా నికర జీరో ఉద్గారాల దిశగా దృష్టి సారిస్తున్నాయి. భారతీయ రైల్వే వర్క్‌షాప్ బ్యాటరీ ఇంజిన్‌ను సిద్ధం చేసింది. రైల్వేలు రెండు 25KV షంటింగ్ ఇంజిన్‌లను కూడా తయారు చేశాయి. ఇవి బ్యాటరీతో కూడా పనిచేస్తాయి. మొత్తంగా చూసుకుంటే 2030 నాటికి జీరో కార్బన్ ఎమిషన్ రైల్ నెట్‌వర్క్‌గా మారే దిశగా రైల్వే శాఖ అడగులు వేస్తోంది. కాగా 2017లో తొలిసారిగా సోలార్ పవర్ సిస్టమ్ టెక్నాలజీతో కూడిన రైలు ట్రాక్‌పై నడిచింది. సౌరశక్తి సాయంతో రైల్వేలను పూర్తిగా హరిత రవాణా మార్గంగా మార్చాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. 




Updated Date - 2022-02-14T16:06:00+05:30 IST