జెన్‌ టెక్‌ ఆదాయం నిరాశాజనకం

ABN , First Publish Date - 2020-11-01T08:47:38+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి జెన్‌ టెక్నాలజీస్‌ పనితీరు నిరాశజనకంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 2020, సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలలకు ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం...

జెన్‌ టెక్‌ ఆదాయం నిరాశాజనకం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి జెన్‌ టెక్నాలజీస్‌ పనితీరు నిరాశజనకంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 2020, సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలలకు ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.14.18 కోట్ల నుంచి రూ.92.47 లక్షలకు తగ్గింది. 90 శాతానికి పైగా క్షీణించింది. ఆదాయం కూడా రూ.47.85 కోట్ల నుంచి రూ.13.06 కోట్లకు పరిమితమైంది. 2020-21 ప్రథమార్ధానికి రూ.17.91 కోట్ల ఆదాయంపై రూ.81 లక్షల నష్టాన్ని చవిచూసింది.

Updated Date - 2020-11-01T08:47:38+05:30 IST