వాటిపైనే... ‘జెన్‌ టెక్నాలజీస్‌’ ద‌ృష్టి...

ABN , First Publish Date - 2021-09-17T01:15:53+05:30 IST

ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ యాంటీ డ్రోన్‌ సిమ్యులేటర్లు, యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్‌, యాంటీ డ్రోన్‌ సిమ్యులేటర్ల హెవీ లిఫ్ట్‌ డ్రోన్‌లు, డ్రోన్‌లపైనే హైదరాబాద్‌కు చెందిన జెన్‌ టెక్నాలజీస్‌ దృష్టి కేంద్రీకరించింది.

వాటిపైనే... ‘జెన్‌ టెక్నాలజీస్‌’ ద‌ృష్టి...

హైదరాబాద్‌ : ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ యాంటీ డ్రోన్‌ సిమ్యులేటర్లు, యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్‌, యాంటీ డ్రోన్‌ సిమ్యులేటర్ల హెవీ లిఫ్ట్‌ డ్రోన్‌లు, డ్రోన్‌లపైనే హైదరాబాద్‌కు చెందిన జెన్‌ టెక్నాలజీస్‌ దృష్టి కేంద్రీకరించింది. రానున్న రోజుల్లో... ఈ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ న క్రమంలో... జెన్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌ అండ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌ అట్లూరి మాట్లాడుతూ... ‘ఇప్పటికే యాంటీ డ్రోన్‌ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టాం’ అని వెల్లడించారు.


కాగా... రెండేళ్ల క్రితం జెన్‌టెక్ యునిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌లో(యూటీఎస్‌) 51 శాతం వాటాను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా... భారత వైమానిక దళానికి కౌంటర్‌ అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌(సీయూఏఎస్‌) సరఫరా చేయడానికి ఇటీవల రూ. 155 కోట్ల ఆర్డర్‌ లభించినట్లు అశోక్ అట్లూరి వెల్లడించారు. ప్రత్యేకించి  యూటీఎస్.. యాంటీ డ్రోన్‌ విభాగంపై దృష్టి పెట్టామని, ఈ ఏడాది  రూ. 15 కోట్ల టర్నోవర్‌‌ను ఈ విభాగంలో ఆశిస్తున్నట్టు వెల్లడించారు.  సైన్యం ఉపయోగించే లెగసీ పరికరాలకు అవసరమైన అన్ని సిమ్యులేటర్లను కంపెనీ కలిగి ఉంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మెడికల్‌ టెక్నాలజీస్‌లో దాదాపు మూడు ఉత్పత్తులను కంపెనీ అభివృద్ధి చేయనుంది. 

Updated Date - 2021-09-17T01:15:53+05:30 IST