Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 25 Jul 2022 21:33:52 IST

Hello World: స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన జీ5

twitter-iconwatsapp-iconfb-icon

ఇప్పటి వరకు జీ5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్‌లను అందిస్తూ వస్తుంది. రీసెంట్‌గా ‘రెక్కీ’ (Recce), ‘మా నీళ్ల ట్యాంక్’ (Maa Neella Tank) వెబ్ సిరీస్‌‌లను వదిలి వీక్షకుల మనసులు గెలుచుకున్న జీ5 ఓటీటీ.. ఇప్పుడు మరో సరికొత్త వెబ్ సిరీస్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ‘జీ5’లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్‌లో రూపొందిన కామెడీ డ్రామాని ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని అందించిన జీ5.. ఇప్పుడదే బ్యానర్‌లో రూపుదిద్దుకున్న ‘హలో వరల్డ్’ (Hello World) అనే వెబ్ సిరీస్‌తో ఎంటర్‌టైన్ చేయబోతుంది. ఈ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ ‌డేట్‌ని తాజాగా జీ5 ప్రకటించింది. ఆర్యన్ రాజేశ్, సదా, సుదర్శన్, రామ్ నితిన్, నయన్ కృష్ణ వంటి వారు నటించిన ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్‌ను ఆగస్ట్ 12 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా జీ5 ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.


‘హలో వరల్డ్’ విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్ ఆఫీస్ డ్రామాగా ఉండబోతుంది.8 ఎపిసోడ్స్‌గా ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో..ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆశగా ఓ పెద్ద ఐటీ కంపెనీలోకి అడుగుపెట్టిన ఎనిమిది మంది సాఫ్ట్‌వేర్ యువకుల కథ ఇదని తెలుస్తుంది. వారు ఊహించిన దానికంటే జీవితంలో ఇంకా ఎంతో ఉందని తెలుసుకునే ప్రయత్నంగా.. దర్శకుడు శివసాయి వర్ధన్ ఈ వెబ్ సిరీస్‌తో తెలియజేయబోతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టే యువ టెక్కీల మనోభావాలను అన్వేషించేలా.. ఈ వెబ్ సిరీస్ ఉండబోతుందని తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సిరీస్ జీ5 వీక్షకులను అలరిస్తుందని Zee5 యాజమాన్యం భావిస్తుంది. కాగా, ఈ సిరీస్‌ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్‌‌పై మెగాడాటర్ నిహారిక నిర్మించారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement