జీ ప్లస్‌-3 గృహాలను లబ్ధిదారులకు అందజేయాలి

ABN , First Publish Date - 2021-10-20T06:30:04+05:30 IST

కందుకూరు పట్టణ ంలో గత ప్రభుత్వంలో నిర్మించిన జీ ప్లస్‌-3 గృహాలను లబ్ధిదారులకు తక్షణం కేటాయించాలని సీపీఎం పట్టణ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

జీ ప్లస్‌-3 గృహాలను లబ్ధిదారులకు  అందజేయాలి
మాట్లాడుతున్న జాలా అంజయ్య

సీపీఎం పట్టణ  కమిటీ డిమాండ్‌ 

కందుకూరు, అక్టోబరు 19: కందుకూరు పట్టణ ంలో గత ప్రభుత్వంలో నిర్మించిన జీ ప్లస్‌-3 గృహాలను లబ్ధిదారులకు తక్షణం కేటాయించాలని సీపీఎం పట్టణ  కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణ  కమిటీ 10వ మహాసభ మంగళవారం డాక్టరు మువ్వా కొండయ్య, ఓ.రామకోటయ్యల అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో సీపీఎం రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందన్నారు. దాని ఫలితంగా ప్రజలపై భారాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జీవీ.కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం అనుసరిస్తున్న విధానాల వలన విద్యుత్‌చార్జీలు విపరీతంగా పెంచడం, చెత్తపై పన్ను వేయటం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా పట్టణ  కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

సీపీఎం పట్టణ  కార్యదర్శిగా ఎస్‌ఏ గౌస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా ఎస్‌కే.మల్లిక, టి.వెంకటరావు, ఎస్‌.పవన్‌కుమార్‌, కృష్ణసుందర్‌, అనూరాధ, ఎం.పద్మావతి, ఎస్‌కే అస్మా, ఉమ, ఖాదర్‌బాషాలను ఎన్నుకున్నారు. సమావేశంలో ఆపార్టీ నాయకులు ముప్పరాజు కోటయ్య, డి.రామమూర్తి, ఎం.ప్రసాదు, ఎ. బాబూరావు, ఎం.రవి తదితరులను ఎన్నుకున్నారు. 

Updated Date - 2021-10-20T06:30:04+05:30 IST