Jun 5 2021 @ 23:00PM

ఆ డైరెక్టర్‌ మరీ దారుణం: జరీన్‌

సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్న సమస్యల్లో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఒకటి. గత మూడేళ్లగా కథానాయికలు గొంతెత్తి తాము ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెడుతున్నారు. తాజాగా జరీన్‌ ఖాన్‌ తాను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. కెరీర్‌ బిగినింగ్‌లో నేను ఇబ్బంది పడ్డాను. అయితే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ల పేర్లను ఇప్పుడు బయట పెట్టాలనుకోవడం లేదు. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్తలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనికంటే మంచివాడు లేడు అనేలా  నాతో మాట్లాడేవాడు.  అతన్ని బాగా నమ్మాను. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడు. అయితే అందులో ముద్దు సీన్‌ ఉంటుంది. దానికి మనం ముందే రిహార్సల్‌ చేద్దామని పిలిచి నాతో అసహ్యంగా ప్రవర్తించాడు. మనసులో భయాన్ని పక్కన పెట్టు అంటూ ఆ డైరెక్టర్‌ నాతో దారుణంగా ప్రవర్తించాడు. మరో వ్యక్తి తన దారిలోకి తెచ్చుకోవాడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడు. ఇద్దరం స్నేహితులకంటే ఎక్కువగా ఉందామని, సినిమా ఆఫర్ల విషయాన్ని తాను చూసుకుంటానని నన్ను నమ్మించాలని చూశాడు’’ అని జరీన్‌ ఖాన్‌ తెలిపారు. తెలుగులో గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలో జరీన్‌ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించారు. 


Bollywoodమరిన్ని...