రాజమండ్రి: రాజమండ్రి గౌతమి ఘాట్‌లో అయ్యప్ప స్వామి ఆలయాన్ని టీటీడీ ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. గోదావరి తీరంలో అనువైన ప్రాంతాన్ని గుర్తిస్తే టీటీడీ సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపడతామన్నారు. పవిత్ర గోదావరి తీరంలో ఉన్న ఆలయాలను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని సుబ్బారెడ్డి తెలిపారు.