TTD చైర్మన్‌గా YV Subbareddy ప్రమాణం.. శ్రీవారికి ఇకపై..

ABN , First Publish Date - 2021-08-11T18:05:09+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం

TTD చైర్మన్‌గా YV Subbareddy ప్రమాణం.. శ్రీవారికి ఇకపై..

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం నాడు టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి.. వైవీ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వామి వారీ సేవ చేసుకొనే భాగ్యం రెండోసారి దక్కడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు.


 శ్రీవారికి ఇకపై...

కరోనా కారణంగా చాలా పనులు చేయలేకపోయాం.. వాటిని ఇప్పుడు చేసేందుకు కృషి చేస్తాం. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలిగే విధంగా తిరుమలలో నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తాం. పర్యావరణ పరిరక్షణ కోసం ఘాట్ రోడ్లలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తాం. శ్రీవారికి ఇకపై గో ఆధారిత నైవేద్యాన్ని సమర్పిస్తాం. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆలయానికి గో మాతను పంపిణీ చేస్తాం. సామాన్య భక్తులకు త్వరితగతిన మెరుగైన దర్శనం కల్పించేందుకు ప్రయత్నం చేస్తాం. కోవిడ్ తీవ్రత తగ్గే వరకు నిభందనలు పాటించవలసిందే. అధికారులతో చర్చించి 15 రోజుల్లో సర్వదర్శనం ప్రారంభిస్తాం. దళారీ వ్యవస్థను పూర్తిగా అరికడతాం. త్వరలోనే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రాష్ర్టంలోని ఆలయాలకు ధూపదీప నైవేధ్యానికి నిధులు కేటాయిస్తాం. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పురాతన ఆలయాలను పునరుద్దరిస్తాం అని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-08-11T18:05:09+05:30 IST