చాహల్ ఖాతాలో అరుదైన రికార్డు

ABN , First Publish Date - 2022-02-07T00:29:53+05:30 IST

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో

చాహల్ ఖాతాలో అరుదైన రికార్డు

అహ్మదాబాద్: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి వికెట్ పడగొట్టిన వెంటనే అతడి ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.


అత్యంత వేగంగా వంద వికెట్లు పడగొట్టిన రెండో ఇండియన్‌ స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో అతడి స్పిన్ పార్ట్‌నర్ కుల్దీప్ యాదవ్ ముందున్నాడు. నికోలస్ పూరన్ వికెట్ పడగొట్టిన చాహల్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాహల్‌కు ఇదే తొలి వన్డే కాగా, ఓవరాల్‌గా 60వ వన్డే.


ఇక, ఓవరాల్‌గా అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన ఐదో ఇండియన్ బౌలర్‌గానూ చాహల్ రికార్డులకెక్కాడు. అహ్మదాబాద్ మ్యాచ్‌కు ముందు చాహల్ ఖాతాలో 99 వికెట్లున్నాయి. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోతుండడంతో చాహల్ కొంతకాలంపాటు జట్టుకు దూరమయ్యాడు.


భారత గడ్డపై మార్చి 2019లో చివరిసారి ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఇదే తొలి మ్యాచ్. తాజా మ్యాచ్‌లో వరుసగా రెండు బంతుల్లో రెండు పెద్ద వికెట్లు తీసుకున్నాడు. నికోలస్ పూరన్, కెప్టెన్ కీరన్ పొలార్డ్‌లను వెనక్కి పంపాడు. 


అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్లు: 

మహ్మద్ షమీ - 56 మ్యాచ్‌లు

జస్ప్రీత్ బుమ్రా - 57 మ్యాచ్‌లు 

కుల్దీప్ యాదవ్ - 58 మ్యాచ్‌లు

ఇర్ఫాన్ పఠాన్ - 59 మ్యాచ్‌లు

యుజ్వేంద్ర చాహల్ - 60 మ్యాచ్‌లు

 

Updated Date - 2022-02-07T00:29:53+05:30 IST